ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించి 40 రోజులు దాటేసింది. యుద్ధంలో నాశనమైన దేశం యొక్క భయానక దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది విడిపోయారు. పెంపుడు కుక్కలు కూడా యజమానులకు చాలా దూరం అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత.. విడిపోయిన కుక్క తన యజమానితో తిరిగి కలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వ్యక్తులకు సహాయం చేయడానికి బెలారస్‌కు చెందిన స్వచ్చంద సంస్థ కస్టస్ కాలినౌస్కీ బెటాలియన్ ఈ వీడియోను షేర్ చేసింది. నెస్సీ అనే కుక్క తన యజమానిని చూసిన వెంటనే అతని వైపు పరుగెత్తడం చూడవచ్చు. నెస్సీ సంతోషంతో అరుస్తూ ఉండడం.. అందరి ముఖంలో చిరునవ్వును నింపుతుంది. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి.. వేలకొద్దీ కామెంట్ లు వస్తున్నాయి. ప్రజలు ఈ రీయూనియన్ వీడియోను ఇష్టపడ్డారు. నెస్సీని ఎంతగానో లైక్ చేశారు.