Video : ఒకేసారి ఆరుగురితో రహస్య డేటింగ్.. అమ్మాయికి షాకిచ్చిన‌ అబ్బాయిలు..!

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఒక వీడియో అంటూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat
Published on : 2 July 2025 4:04 PM IST

Video : ఒకేసారి ఆరుగురితో రహస్య డేటింగ్.. అమ్మాయికి షాకిచ్చిన‌ అబ్బాయిలు..!

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఒక వీడియో అంటూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. ఒక అమ్మాయి ఒకేసారి ఆరుగురు పురుషులతో రహస్యంగా డేటింగ్ చేస్తోంది. వారిలో ఒక వ్యక్తి ఈ విషయం తెలుసుకుని మిగిలిన అయిదుగురికి కాల్ చేసి విషయం చెప్పాడు.

ఆ వ్యక్తి ఒక కేఫ్‌లో కూర్చుని ఆమె కళ్ళు మూసి ఉంచగా.. మరో ఐదుగురు అక్కడికి వచ్చారు. అందరినీ ఒకే చోట ఆమె చూసినప్పుడు సిగ్గుతో తలదించుకోవడం మనం చూడొచ్చు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె కన్నీళ్లతో కనిపిస్తుంది. ఆమె కోపంగా టేబుల్‌పై కొట్టింది. ఆ మహిళ ఆరుగురు పురుషులతో రహస్యంగా డేటింగ్ చేస్తున్న ఈ వీడియో ఆధునిక డేటింగ్‌పై చర్చకు దారితీసింది. అయితే ఇది నిజమైనదా లేక క్రియేట్ చేసిన వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది.


Next Story