ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 174కి చేరిన మృతుల సంఖ్య

Death toll in Indonesia football ground stampede rises to 174. ఇండోనేషియా హింసాకాండ ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. మలాంగ్మ్‌లో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో జరిగిన

By అంజి  Published on  2 Oct 2022 9:33 AM GMT
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 174కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేషియా హింసాకాండ ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. మలాంగ్మ్‌లో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 174కి చేరింది. మరో 180 మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు మృతుల సంఖ్య 158గా ఉండగా, ఉదయం 10.30కి 174కి చేరిందని, మరణాలు సంఖ్య పెరగొచ్చని తూర్పు జావా డిప్యూటీ గవర్నర్‌ ఎమిల్‌ డార్‌డట్‌ తెలిపారు. ఈ హింసాకాండ శనివారం రాత్రి మలాంగ్మ్‌ నగరంలో జరిగింది.

ఇప్పటి వరకు వరల్డ్‌ వైడ్‌గా స్టేడియాల్లో జరిగిన ఘోరమైన సంఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది. తొక్కిసలాట జరిగిన తర్వాత స్టేడియంలో విషాదకర పరిస్థితులు కనిపించాయి. కాలిపోయిన పోలీసు వ్యాన్​, గాయలతో పడి ఉన్న క్షతగాత్రులు, సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్​గా మారాయి. ఆసుపత్రుల్లో సైతం ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధితుల్లో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉందని డాక్టర్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే?

తూర్పుజావాలోని మ‌లాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శ‌నివారం రాత్రి అరెమా ఎఫ్‌సి, పెర్సెబయా సురబయ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు మైదానానికి త‌ర‌లి వ‌చ్చారు. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో అరేమా 3-2 తేడాతో ఓడిపోయింది. సొంత మైదానంలో జ‌రిగిన‌ మ్యాచ్‌లో అరేమా జ‌ట్టు ఓట‌మిని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. కొంద‌రు అభిమానులు గుంపులుగా ఏర్ప‌డి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అభిమానులను దూషించ‌డంతో పాటు కొట్ట‌డం మొద‌లుపెట్టారు. అడ్డుకోబోయిన అధికారుల‌ను సైతం విడిచిపెట్ట‌లేదు. ఇరుజ‌ట్ల మ‌ధ్య అభిమానులు కొట్లాట‌కు దిగ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి అదుపుత‌ప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్య‌లో మైదానానికి చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియ‌ర్ గ్యాస్ ను ప్ర‌యోగించారు. దీంతో వేలాది మంది అభిమానులు ఊపిరిపీల్చుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డ్డార‌ని, దీంతో మైదానంలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశార‌ని, ఈ క్ర‌మంలో అక్క‌డ తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది.

Next Story