ఫైజర్ వ్యాక్సిన్.. కొన్ని డోస్ లు పనికిరాకుండా పోతున్నాయి..!
COVID-19 vaccine update. ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను పలు దేశాలు ఇప్పటికే ఆమోదించి, ప్రజలకు ఇవ్వడాన్ని
By Medi Samrat Published on 17 Dec 2020 11:36 AM GMTఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను పలు దేశాలు ఇప్పటికే ఆమోదించి, ప్రజలకు ఇవ్వడాన్ని ప్రారంభించాయి. ఈ వ్యాక్సిన్ ప్రజలకు చేరడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్ లను ఉంచాల్సిన ఉష్ణోగ్రతకన్నా మరింత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉంచడం వల్ల సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. కాలిఫోర్నియాకు సరఫరా చేసిన రెండు ట్రేల కరోనా వ్యాక్సిన్ డోస్ లు పనికిరాకుండా పోయాయని, వీటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువకు పడిపోవడమే కారణమని యూఎస్ ఆర్మీ జనరల్ గుస్టెవా పెర్నా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల వద్దే నిల్వ చేయాల్సి వుందని, అంతకన్నా తక్కువకు తగ్గడంతో టీకాను రీప్లేస్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఫైజర్ సంస్థ ప్రొడక్షన్ లైన్స్ లో సైతం సమస్యలు తలెత్తాయని యూఎస్ సెక్రెటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమర్ సర్వీసెస్ అలెక్స్ అజార్ తెలియజేశారు. అమెరికన్లు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఫైజర్ కు అవసరమైన సహాయ సహకారాలను అందించి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ వార్తల కారణంగా వ్యాక్సిన్ మరింత ఆలస్యం అవుతుందోనన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
ఫైజర్ అందిస్తున్న వ్యాక్సిన్‌ను గతంలో అలెర్జీల బారినపడిన వ్యక్తులకు వినియోగించవద్దంటూ యూకే ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కట్టడికి ఔషధాలు, ఆహారం లేదా లేదా ఏ ఇతర అలెర్జీ సంబంధ రియాక్షన్స్ ఉన్న వ్యక్తులకూ వ్యాక్నిన్‌ను అందించవద్దని పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చాక జాతీయ ఆరోగ్య సర్వీసుల(ఎన్‌హెచ్‌ఎస్)కు చెందిన ఇద్దరు ఉద్యోగులు అలెర్జిక్ రియాక్షన్స్‌కు లోనుకావడంతో యూకే ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.