కోవాగ్జిన్‌ టీకాను గుర్తించిన ఆస్ట్రేలియా

Covaxin recognised australia. భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా

By అంజి  Published on  2 Nov 2021 9:55 AM IST
కోవాగ్జిన్‌ టీకాను గుర్తించిన ఆస్ట్రేలియా

భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సుమారు 20 నెలల పాటు ఆస్ట్రేలియా సరిహద్దులను మూసివేసింది. తాజాగా ప్రయాణికులను దేశంలోకి అనుమతించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది అస్ట్రేలియా. ఆక్స్‌ఫర్స్‌ యూనివర్సిటీ - ఆస్ట్రాజెనెకా కలిసి తయారు చేసిన కొవిషీల్డ్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.

ఇప్పుడు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌, సినోఫామ్‌ తయారు చేసిన బీబీఐబీపీ-కోర్‌ వి వ్యాక్సిన్‌లను ఆస్ట్రేలియా గుర్తిస్తూ.. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి అధికారికంగా గుర్తించాలని ప్రకటన విడుదల చేసింది. 12 ఏళ్ల, ఆపై ఎక్కువ వయస్సున ఉన్న వారు కొవాగ్జిన్‌ పూర్తి డోసు తీసుకుంటే ఆస్ట్రేలియా వెళ్లవచ్చు. దేశీయంగా తయారైన కొవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు ధన్యవాదాలు తెలిపారు మోడీ.

Next Story