రూ. 12.65 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్న భ‌ర్త‌.. విడాకులు కోరిన భార్య.. ఎందుకంటే.?

చైనాలోని డెజౌకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో హఠాత్తుగా వార్తల్లో నిలిచాడు.

By -  Medi Samrat
Published on : 19 Oct 2025 4:07 PM IST

రూ. 12.65 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్న భ‌ర్త‌.. విడాకులు కోరిన భార్య.. ఎందుకంటే.?

చైనాలోని డెజౌకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో హఠాత్తుగా వార్తల్లో నిలిచాడు. 2024లో అతడు 10.17 మిలియన్ యువాన్ (సుమారు 1.4 మిలియన్ డాలర్లు అంటే 12.65 కోట్ల రూపాయలు) విలువైన లాటరీని గెలుచుకున్నాడు. లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్న తరువాత.. అతడు రాత్రికిరాత్రే ప్రసిద్ధి చెందాడు. అయితే హఠాత్తుగా వచ్చిన డబ్బుల మత్తు అతడికి ఎంతగా పెరిగిపోయిందంటే.. ఏకంగా భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఈ వ్యక్తి లాటరీ డబ్బులో ఎక్కువ భాగం జూదం, బెట్టింగ్, లైవ్ స్ట్రీమర్‌లకు టిప్పింగ్ కోసం ఖర్చు చేశాడు. దీంతో అతని భార్య కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాటరీ తగిలిన వ్యక్తి ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. అతని భార్య ఇంటిపేరు యువాన్. లాటరీని గెలుచుకున్న తర్వాత అతను తన భార్యకు బ్యాంక్ కార్డ్ ఇచ్చాడు. అందులో 3 మిలియన్ యువాన్లు (సుమారు 420,000 US డాలర్లు అంటే రూ. 3.7 కోట్లు) ఉన్నాయి. భార్య భర్తను నమ్మి కార్డును అల్మారా లాకర్‌లో ఉంచింది.

లాటరీ త‌గిలిన త‌ర్వాత‌ భ‌ర్త ప్రవర్తన రోజురోజుకు మారడం ప్రారంభించింది. రోజంతా జూదం ఆడడం ప్రారంభించి మహిళా లైవ్ స్ట్రీమర్లకు లక్షల రూపాయల విలువైన టిప్‌లు ఇవ్వడం ప్రారంభించాడు. అతను ఒక మహిళా స్ట్రీమర్‌కు 12 లక్షల యువాన్ (సుమారు 168,000 US డాలర్లు అంటే 20.87 లక్షల రూపాయలు) టిప్ ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు.. ఈ సంవత్సరం జూలైలో అతను మహిళా స్ట్రీమర్‌తో కలిసి 4 రోజుల విదేశీ పర్యటనకు కూడా వెళ్ళాడు.

అయితే.. భార్య తన భర్త ఫోన్‌ను చూడ‌గా.. అతడు మహిళా స్ట్రీమర్‌ను 'హనీ' అని పిలుస్తుండ‌గా, ఆమె తనని 'హబ్బీ' అని పిలుస్తుంద‌ని గ్ర‌హించింది. ఇదంతా చూసిన ఆ మహిళ ఆగ్రహానికి గురై కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. అదే సమయంలో డ్రాయర్‌లో ఉంచిన బ్యాంకు కార్డును పరిశీలించగా.. ఆ కార్డు ఖాళీ అయ్యి ఉంది. అందులో అస్సలు డబ్బు లేదు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాటరీ ఒకరిని రాత్రికి రాత్రే ధనవంతులుగా మార్చడమే కాకుండా.. వ్యక్తి వివాహాన్ని నాశనం చేసే చెడు ప్రభావాన్ని చూపుతుందని తిట్టిపోస్తున్నారు.

Next Story