తగ్గుతోన్న చైనా జనాభా.. ఆందోళనలో డ్రాగన్ కంట్రీ
By Knakam Karthik Published on 17 Jan 2025 1:33 PM ISTతగ్గుతోన్న చైనా జనాభా.. ఆందోళనలో డ్రాగన్ కంట్రీ
పాపులేషన్‌లో వరల్డ్‌లోనే రెండో ప్లేస్‌లో ఉన్న చైనాలో వరుసగా మూడో సంవత్సరం జనాభా తగ్గింది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో పోరాడుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడం పట్ల ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి సంతృప్తికర ఫలితాలను ఇవ్వడంలేదని తెలుస్తోంది. వరుసగా మూడో ఏడాది కూడా జనాభా తగ్గుదల నమోదవుతోంది. ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ దేశం భావిస్తోంది.
ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా కలిగిన చైనాకు జనాభా సవాళ్లను సూచిస్తోంది. తాజాగా చైనా జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024లో చైనా జనాభా 1.39 మిలియన్ మందికి తగ్గిపోయి, మొత్తం జనాభా 140.80 కోట్లకు చేరింది. అయితే, ఈ సంవత్సరంలో 9.54 మిలియన్ మంది పిల్లలు జన్మించినా, ఇది జనాభా పెరుగుదలపై ప్రభావం చూపలేకపోయింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 5.2 లక్షల మంది అధికమైనా, 2023లో 20.8 లక్షల మంది జనాభా తగ్గడం కీలకాంశంగా నిలిచింది. అంతేకాకుండా, 2023లో జననాల రేటు తగ్గి 90.2 లక్షల మంది మాత్రమే జన్మించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య పెరగడం కూడా జనాభా తగ్గుదలకు కారణమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
చైనా ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో మానవ వనరులు ప్రధాన పాత్ర పోషించాయి. యువత ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. అయితే జనాభా తగ్గుదల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది.
గతంలో జనాభా పెరుగుదలపై నియంత్రణ విధానాలను అనుసరించడం ఈ సమస్యకు దారితీసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు 2016లో ఒకే సంతానం విధానాన్ని రద్దు చేసింది. అదనంగా, జనాభా పెంపొందన కోసం నానాప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, గృహాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు వంటి సదుపాయాలు కల్పించడం ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉంది.
జనాభా సంఖ్య పడిపోతున్న దేశాల జాబితాలో చైనా చేరింది. చైనా ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో మానవ వనరులు ప్రధాన పాత్ర పోషించాయి. యువత ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. అయితే జనాభా తగ్గుదల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది. గతంలో జనాభా పెరుగుదలపై నియంత్రణ విధానాలను అనుసరించడం ఈ సమస్యకు దారితీసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు 2016లో ఒకే సంతానం విధానాన్ని రద్దు చేసింది. అదనంగా, జనాభా పెంపొందన కోసం నానాప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, గృహాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు వంటి సదుపాయాలు కల్పించడం ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉంది.
ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటుంది. జననాల రేటు తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది స్కూల్స్ మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక తెలిపింది. ఖాళీగా ఉన్న పాఠశాలలు, కిండర్ గార్డెన్‌లు ఇప్పుడు వృద్ధులు సంరక్షణ సెంటర్లుగా రూపాంతరం చెందాయి.