భూమి దిశగా చైనా రాకెట్‌ శిథిలాలు.. భారత్‌పై పడే ఛాన్స్‌.!

China says closely tracking rocket debris hurtling towards earth. చైనా దేశం ఇటీవల ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ శిథిలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. మరో వారం రోజుల్లో రాకెట్

By అంజి  Published on  28 July 2022 5:23 PM IST
భూమి దిశగా చైనా రాకెట్‌ శిథిలాలు.. భారత్‌పై పడే ఛాన్స్‌.!

చైనా దేశం ఇటీవల ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ శిథిలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. మరో వారం రోజుల్లో రాకెట్ విడి భాగాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే ఛాన్స్‌ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రాకెట్‌ శిథిలాలు అమెరికాతో పాటు భారత్‌ సహా దక్షిణాసియా ప్రాంతంలో, ఆఫ్రికా, బ్రెజిల్‌ తదితర ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే వీటి వల్ల భూమికి పెద్ద ముప్పు ఉండదని వెల్లడించింది.

చైనా సొంతంగా అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్‌యంలోనే స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించింది. 2020 నుంచి ఈ రాకెట్‌ను మూడుసార్లు చైనా ఉపయోగించింది. ప్రయోగం అనంతరం రాకెట్ కు సంబంధించి ప్రధాన భాగాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి. అవి మెల్లగా భూమి వైపు వస్తున్నట్టు ఏరోస్పేస్ కార్పొరేషన్ గుర్తించింది. జులై 31న రాకెట్ భాగాలు భూమి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఏరోస్పేస్ అంచనా వేసింది.

అయితే 100 మీటర్ల పొడవు, 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్‌ విడి భాగాలు పూర్తిగా కాలిపోవని, కొన్ని భూమిని తాకే ఛాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. కిందటేడాది స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం పంపిన రాకెట్‌ పని పూర్తయ్యాక దాని శకలాలు ఎలాంటి నియంత్రణ లేకుండా భూవాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా చైనాకు చెందిన ఓ రాకెట్‌ శిథిలాలు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో పడ్డాయి.

Next Story