చైనాలో మళ్లీ హై టెన్షన్

China faces fresh COVID outbreak; flights cancelled. కరోనాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది చైనానే అంటూ ఇప్పటికే పలు దేశాలకు

By M.S.R  Published on  22 Oct 2021 5:37 PM IST
చైనాలో మళ్లీ హై టెన్షన్

కరోనాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది చైనానే అంటూ ఇప్పటికే పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇన్ని రోజులూ కాస్త కరోనా కేసులు అక్కడ తగ్గినా.. మళ్లీ కరోనా కలకలం మొదలైంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేయడమే కాకుండా.. స్కూల్స్ మూసివేశారని తెలుస్తోంది. గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. చైనా మాత్రం దేశీయంగా అన్నింటినీ మూసివేయడం పట్ల.. మళ్లీ ఏదో జరిగిందనే అవమానాలకు తావిస్తోంది.

అధికారులు చెబుతున్న దాని ప్రకారం చైనా వరుసగా 5వ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. పర్యాటకుల వల్లనే కరోనా ఎక్కువ అయిందని చైనా ప్రభుత్వం అంటోంది. విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా.. పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు. జియాన్, లాంజౌలోని రెండు ప్రధాన విమానాశ్రయాలకు 60 శాతం విమానాలు రద్దు చేశారు. తమ పౌరులకు జారీచేసిన నోటీసులో ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హాట్ నగరం లోపల, వెలుపల ప్రయాణం నిషేధించారనీ, నివాసితులు తమ గృహాలను వదిలి వెళ్లవద్దని సూచించారు.


Next Story