సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం

Charles Sobhraj, French serial killer, to be released after 19 years in Nepal jail. 19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను అతని వయసు రీత్యా విడుదల

By M.S.R  Published on  21 Dec 2022 8:45 PM IST
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం

19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను అతని వయసు రీత్యా విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్ 2003 నుంచి నేపాల్ జైలులో ఉన్నట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ విడుదలకు నేపాల్‌ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన 15 రోజుల లోపలే అతడిని దేశం నుంచి పంపించేయాలని కూడా నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది.

1975లో నేపాల్‌లోకి ప్రవేశించడానికి నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి, US పౌరుడు కొన్నీ జో బోరోన్‌జిచ్, అతని స్నేహితురాలు కెనడియన్ లారెంట్ క్యారియర్ లను చంపినట్లు శోభరాజ్‌పై అభియోగాలు మోపారు. అతను సెప్టెంబర్ 1, 2003న నేపాల్‌లోని కాసినో వెలుపల కనిపించాడు. అతని అరెస్టు తర్వాత, పోలీసులు అతనిపై జంటను హత్య చేసిన ఆరోపణలపై రెండు వేర్వేరు హత్య కేసులను నమోదు చేశారు. అతను ఖాట్మండులోని సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. చార్లెస్‌ శోభరాజ్‌ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నాడు. కానీ, వారికి పిల్లలు కలిగిన తర్వాత శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేశారు. అతడు చేసిన నేరాల కారణంగా అప్పట్లో ప్రపంచ దేశాల్లో అతని పేరు మారుమోగింది. నేపాల్‌ సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. దాదాపు 20 ఏండ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం లాంటి కారణాలతో చార్లెస్‌ శోభరాజ్‌ విడుదలకు ఆదేశిస్తున్నట్టు నేపాల్‌ సుప్రీంకోర్టు తెలిపింది.


Next Story