కుప్పకూలిన కార్గో విమానం.. ముగ్గురు దుర్మరణం
Cargo Plane Crash Lands In Russia 3 Killed.ఓ కార్గో విమానం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన రష్యా దేశంలో
By తోట వంశీ కుమార్ Published on
24 Jun 2022 4:45 AM GMT

ఓ కార్గో విమానం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన రష్యా దేశంలో జరిగింది. ఇల్యుషిన్ ఇల్ -76 కార్గో విమానం శుక్రవారం ఉదయం రియాజాన్ నగరానికి సమీపంలో ల్యాండింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 9 మంది ఉన్నారు. అందులో ముగ్గురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఇది ఏ సంస్థకు చెందిన విమానం అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story