పడవ బోల్తా 10 మంది మృతి.. ఇంకొందరు గల్లంతు

Capsized river boat leaves 10 dead in southwest China. చైనాలోని గ్విజోవ్ ప్రావీన్స్‌లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని

By M.S.R  Published on  20 Sep 2021 5:08 AM GMT
పడవ బోల్తా 10 మంది మృతి.. ఇంకొందరు గల్లంతు

చైనాలోని గ్విజోవ్ ప్రావీన్స్‌లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్‌ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్‌లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్‌లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.

ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. గ్విజోవ్ రాష్ట్రం లివ్‌ప్యాన్‌ష్యు నగరం సమీపంలోని జాంగ్కే నదిలో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత మందిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్థానిక అధికారి మీడియాకు చెప్పారు. విద్యార్థుల తల్లిండ్రులు తమ బిడ్డలకు ఏమైందా అని తల్లడిల్లుతున్నారు.


Next Story