ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మహిళ కడుపులో ఏకంగా 124 కొకైన్ నింపిన క్యాప్సూల్స్ కనిపించాయి. బ్రెజిల్ కు చెందిన మహిళ అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపింది. భారతదేశంలో స్మగ్లింగ్ కోసం తీసుకువస్తున్న ఈ కొకైన్ ధర ₹ 9.73 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల జాడ కోసం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సావో పాలో నుండి దిగిన ఆ మహిళను అడ్డగించారని DRI ముంబై జోనల్ యూనిట్ అధికారి తెలిపారు.
డ్రగ్స్‌తో ఉన్న క్యాప్సూల్స్‌ను తన శరీరంలోకి తీసుకుని భారత్‌లోకి వచ్చినట్లు మహిళ అంగీకరించింది. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆ తర్వాత జేజే ఆస్పత్రిలో చేర్చారు. ఆమె అక్రమ మార్కెట్‌లో 9.73 కోట్ల రూపాయల విలువైన 973 గ్రాముల కొకైన్‌ను కలిగి ఉన్న 124 క్యాప్సూల్స్‌ను మింగేసిందని అధికారి తెలిపారు. ప్రయాణికురాలిని అరెస్టు చేశారు, ఆమెకు సహాయం చేసిన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యులను కనుగొనడానికి తదుపరి విచారణ జరుగుతోందని వివరించారు.