100 రోజులు ఒకే 'డ్రెస్'లో ఉన్న మహిళ.. ఎందుకంటే?

Boston woman wears same dress for 100 days straight. సాధారణంగా ఒక రోజు వేసుకున్న డ్రస్సు మరొక రోజు వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు కానీ 100 రోజులు ఒకే 'డ్రెస్'లో ఉన్న మహిళ.

By Medi Samrat  Published on  10 Jan 2021 3:42 AM GMT
Boston woman sara boreson

సాధారణంగా ఒక రోజు వేసుకున్న డ్రస్సు మరొక రోజు వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. మరికొందరైతే ఒకే రోజు రెండు మూడు డ్రెస్సులను మార్చే వారు కూడా ఉన్నారు. రోజుకు ఒక డ్రెస్ వేసుకొని నెల రోజుల పాటు వేసిన డ్రెస్ మరి వేయకుండా ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉండడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఒక వారం రోజుల పాటు ఒకే డ్రెస్ లో ఉంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. అలాంటిది ఒకే డ్రెస్100 రోజులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ విధంగా ఊహించుకుంటేనే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం వంద రోజులు ఒకే డ్రెస్ వేసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 52 ఏళ్ల సారా రాబిన్స్‌ కోల్‌ అనే మహిళ '100 రోజులు.. ఒకే డ్రెస్‌' వేసుకొని ఫ్యాషన్లకు దూరంగా ఉంటూ సాధారణ జీవితం గడపటానికి వందరోజుల చాలెంజ్ ను స్వీకరించింది. ఈ చాలెంజ్ ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి నిన్నటి వరకు ఆ మహిళ బ్లాక్ మెరినో ఊల్‌ డ్రెస్ వేసుకుని తన చాలెంజ్ పూర్తి చేసింది. ఆ మహిళ ఇదే డ్రెస్ వేసుకుని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగానికి, చర్చికి కూడా వెళ్ళేది. ఆఖరికి క్రిస్మస్ పండుగ రోజు కూడా అదే డ్రెస్ వేసుకుని క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంది.

ఈ వంద రోజుల చాలెంజ్ ను ఒక డాక్యుమెంటరీ గా రూపొందించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ డ్రెస్ పై అప్పుడప్పుడు రంగురంగుల జాకెట్, షర్ట్స్ వేసుకునేది. అయితే ఈ వంద రోజులు ఒకే డ్రెస్ చాలెంజ్ తీసుకున్నవారిలో సార మొదటి వ్యక్తి కాదని చెప్పవచ్చు."ఉల్‌ అండ్"కంపెనీ తయారు చేసిన "రొవెనా స్వింగ్‌ డ్రెస్‌ను"తయారు చేసి సాదాసీదాగా జీవించేవారు, జాగ్రత్తగా వాడుకోవటం, మంచిగా ఉండటం వంటి సూత్రాలు తెలిసినవారికి వంద రోజులు చాలెంజ్ ను ఇస్తామని తెలియజేసింది.ఈ చాలెంజ్ ను స్వీకరించే 50 మందికి మా డ్రెస్సులను అందజేస్తామని అధికారిక వెబ్ సైట్లో పేర్కొనడం వల్ల సారా ఈ చాలెంజ్ స్వీకరించి వంద రోజుల పాటు ఒకే డ్రస్ లో ఉంది. ఈ విధంగా వంద రోజులు ఒక డ్రెస్ వేసుకోవడంతో ప్రస్తుతం ఈ మహిళా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Next Story