పాక్‌కు యుద్ధం తప్ప మరో మార్గం లేదు.. బెదిరింపుల‌కు దిగిన బిలావల్ భుట్టో

పాకిస్థాన్ భారత్‌ను త‌న క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో రెచ్చ‌గొడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్య‌ల త‌ర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సింధూర్‌ మరియు సింధు జల ఒప్పందంపై భారత్‌ను తిట్టడం ప్రారంభించాడు.

By Medi Samrat
Published on : 12 Aug 2025 2:21 PM IST

పాక్‌కు యుద్ధం తప్ప మరో మార్గం లేదు.. బెదిరింపుల‌కు దిగిన బిలావల్ భుట్టో

పాకిస్థాన్ భారత్‌ను త‌న క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో రెచ్చ‌గొడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్య‌ల త‌ర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సింధూర్‌ మరియు సింధు జల ఒప్పందంపై భారత్‌ను తిట్టడం ప్రారంభించాడు. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్‌కు భారత్ భారీ నష్టాన్ని కలిగించిందని బిలావల్ భుట్టో అంగీకరించాడు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మొత్తం పాక్ ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

PPP పార్టీ ఛైర్మన్, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. భారత్‌ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తూనే ఉంటే.. అప్పుడు పాకిస్తాన్‌కు యుద్ధం తప్ప మరో మార్గం లేదని బెదిరింపుల‌కు దిగాడు. పాకిస్థాన్ ప్రజలను రెచ్చగొడుతూ బిలావల్ భుట్టో ఇలా అన్నాడు.. మనం యుద్ధం చేయడం ద్వారా మొత్తం 6 నదుల నీటిని తిరిగి పొందవచ్చు. భారత్‌ సింధు జల ఒప్పందంపై దృఢంగా ఉంటే.. మనకు యుద్ధం తప్ప మరో మార్గం లేదని రెచ్చ‌గొట్టారు.

ఆపరేషన్ సిందూర్‌పై బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. "మేము యుద్ధం ప్రారంభించలేదు. కానీ మీరు ఆపరేషన్ సింధూర్ లాగా మాపై దాడి చేస్తే, పాకిస్తాన్ ప్రజలు మీపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఈ యుద్ధంలో ఓడిపోతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న‌ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా అణు బాంబు దాడి చేస్తామ‌ని బెదిరించాడు.. పాకిస్తాన్ చాలా దేశాలను నాశనం చేస్తుందని చెప్పాడు. సింధునదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే దానిపై 10 క్షిపణులు వేస్తామని అసీమ్ మునీర్ ఎగతాళిగా చెప్పాడు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు అని వ్యాఖ్యానించాడు.

Next Story