మ్యాచ్ టెలికాస్ట్ చేస్తుండగా అలాంటి సౌండ్స్.. క్షమాపణలు చెప్పిన బీబీసీ

BBC Apologises As Wolves vs Liverpool FA Coverage Is Sabotaged By 'Sex Noise. వోల్వ్స్, లివర్‌పూల్ మధ్య జరిగిన FA కప్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన సౌండ్స్ సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  18 Jan 2023 4:07 PM IST
మ్యాచ్ టెలికాస్ట్ చేస్తుండగా అలాంటి సౌండ్స్.. క్షమాపణలు చెప్పిన బీబీసీ

వోల్వ్స్, లివర్‌పూల్ మధ్య జరిగిన FA కప్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన సౌండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు జట్ల మధ్య మూడవ రౌండ్ రీప్లేను ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు గ్యారీ లినేకర్ ప్రదర్శిస్తున్నప్పుడు 'లైంగికపరమైన శబ్దాలు' వినిపించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ప్రధానంగా చర్చించుకున్నారు. మొబైల్ ఫోన్ నుండి వచ్చిన శబ్దాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని.. అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు బీబీసీ నెట్‌వర్క్ క్షమాపణలు చెప్పింది.

యూట్యూబ్ ప్రాంక్ స్టర్ డేనియల్ జార్విస్ ఈ చర్యకు బాధ్యత వహించాడు. మ్యాచ్ జరిగిన స్టేడియం మోలినెక్స్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జార్విస్ అనేక సందర్భాల్లో ఇలాంటి పనులు చేశాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పలు ఫుట్‌బాల్, క్రికెట్ గేమ్ ల కారణంగా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. గతంలో, జార్విస్ ఓవల్ పిచ్‌పై ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోను ఢీకొట్టిన సంఘటన క్రికెట్ లవర్స్ మర్చిపోరు. భారత్ తో మ్యాచ్ ల సమయంలో కూడా జార్విస్ చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు.

Next Story