భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను మోహరించినట్లు నివేదికలు రావడంతో భారతసైన్యం సరిహద్దులో నిఘాను పెంచింది. షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల కారణంగా భారత్ కూడా అలర్ట్ అయింది. భారత్‌తో సరిహద్దుకు సమీపంలో డ్రోన్ల మోహరింపుపై వచ్చిన నివేదికలను సైన్యం పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించినట్లు చెబుతున్నా అధునాతన డ్రోన్‌లను సున్నితమైన ప్రాంతంలో ఉంచడంపై భారతదేశం అనుమానాలను వ్యక్తం చేస్తోంది.
భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో తీవ్రవాదులు తిరిగి పట్టుసాధిస్తున్నాయని నివేదికలు భారత్ కు అందాయి. ఈ ఏడాది ప్రారంభంలో టర్కీ నుండి బైరక్టార్ TB2 డ్రోన్‌లను బంగ్లాదేశ్ కొనుక్కుంది. వాటిని ఇటీవల సరిహద్దుల్లో వాడారు. తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి సైనిక సామర్థ్యాలను బంగ్లాదేశ్ వినియోగిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బంగ్లాదేశ్ డ్రోన్ వినియోగాలను భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది.