చిన్మోయ్ దాస్ కు దక్కని బెయిల్
సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ కు బెయిల్ ఇవ్వడానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది.
By Medi Samrat Published on 2 Jan 2025 7:45 PM IST
సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ కు బెయిల్ ఇవ్వడానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది. జనవరి 2, 2025న పటిష్ట భద్రత మధ్య విచారణ జరగగా ఛటోగ్రామ్‌లోని కోర్టు బెయిల్ ఇవ్వలేదు. సుమారు 30 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ అభ్యర్థనను చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం తిరస్కరించారు. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ విచారణలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇది చాలా బాధాకరమైన వార్త అని కోల్‌కతా ఇస్కాన్ వీపీ రాధా రామన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తోందన్నారు. కొత్త సంవత్సరంలో చిన్మోయ్ ప్రభుకి స్వేచ్ఛ లభిస్తుందని అందరూ ఆశించారని, అయితే 42 రోజుల తర్వాత కూడా ఆయనకు బెయిల్ తిరస్కరించారన్నారు.
చిన్మోయ్ కృష్ణ దాస్ దేశద్రోహం కేసులో అరెస్టయి బంగ్లాదేశ్ జైలులో ఉన్నారు. ఆయనకు గతంలో కూడా బెయిల్ నిరాకరించారు. మైనారిటీల హక్కులు, భద్రత కోసం పోరాడే బంగ్లాదేశ్ సమ్మిలితా సనాతనీ జాగరణ్ జోటే సమూహానికి ఆయన ప్రతినిధిగా ఉన్నారు.