అవి కూడా అంతరించిపోతున్నాయి
Bad news for sharks. వాతావరణ మార్పులు.. మనుషుల స్వార్థం కారణంగా ఎన్నో జీవులు అంతరించిపోతూ
By M.S.R Published on 5 Sep 2021 11:04 AM GMTవాతావరణ మార్పులు.. మనుషుల స్వార్థం కారణంగా ఎన్నో జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. భూమి మీద ఉన్న జీవులే కాదు.. నీటిలో ఉన్న చాలా జీవులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఆ లిస్ట్ ఒక్కో ఏడాదికీ పెరిగిపోతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్‌లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా అవతరించిపోతున్న జంతువుల వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది.
తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపింది. ఇక షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది.
దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి.