కృత్రిమ గుండెతో 100 రోజులు జీవించిన మనిషి.. ఆ తర్వాత దాత దొరకడంతో..
వైద్య శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 13 March 2025 4:00 PM IST
వైద్య శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని పూర్తిగా మెటల్‌తో తయారు చేసిన గుండెపై 100 రోజుల పాటు ఉంచారు. టైటానియంతో తయారు చేసిన గుండెను వ్యక్తి లోపల అమర్చారు. ఈ యాంత్రిక హృదయం సహాయంతో ఆ వ్యక్తి 100 రోజులు జీవించి ఉన్నాడు. ఇది ఒక అద్భుతం. ఆ మనిషి వయస్సు 40 సంవత్సరాలు. అతడు టైటానియంతో తయారు చేసిన గుండెను ఉపయోగించిన మొదటి వ్యక్తి అయ్యాడు.
నవంబర్ 2023లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో ఆ వ్యక్తికి ఆపరేషన్ జరిగింది. రోగి గుండె పూర్తిగా విఫలమైంది. వెంటనే గుండె దాత ఎవరూ దొరకలేదు. దీంతో డాక్టర్ల బృందం 6 గంటల శస్త్రచికిత్స చేసి రోగికి డానియల్ టిమ్స్ రూపొందించిన BiVACOR టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్‌ను పూర్తిగా అమర్చారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రోగి ఈ గుండెతో సజీవంగా ఉన్నాడు. సాధారణంగా పనిచేయడం ప్రారంభించాడు. అతనికి గుండె ఇవ్వడానికి దాత దొరకగానే వంద రోజుల తర్వాత అతని శరీరంలో మానవ గుండెను అమర్చారు.
BiVACOR కృత్రిమ గుండె మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది హై-స్పీడ్ రైళ్లలో ఉపయోగించే సాంకేతికతను పోలి ఉంటుంది. ఇది శరీరం.. ఊపిరితిత్తులలోకి రక్తాన్ని పంప్ చేయడానికి పనిచేస్తుంది.. తద్వారా గుండె రెండు జఠరికల పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
ఇది ఒక కదిలే భాగాన్ని మాత్రమే కలిగి ఉంది.. తిరిగే రోటర్, గుండె అయస్కాంతాల సహాయంతో సమతుల్యం అవుతుంది. దీనిని టైటానియంతో తయారు చేశారు.. కవాటాలు లేదా మెకానికల్ బేరింగులు లేవు. ఈ గుండె మరింత మన్నికైనది.. ప్రభావవంతంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.