భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..!

ఆస్ట్రేలియా విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకునే భారతీయులకు ఇదొక షాకింగ్ న్యూస్.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 11:50 AM IST

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..!

ఆస్ట్రేలియా విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకునే భారతీయులకు ఇదొక షాకింగ్ న్యూస్. ఎందుకంటే భారతదేశాన్ని అత్యంత ప్రమాదకర వర్గానికి (అసెస్‌మెంట్ లెవల్ 3, లేదా AL3) వర్గీకరించింది. కఠినమైన డాక్యుమెంటరీ అవసరాలు ఉన్నాయని, దరఖాస్తులపై మరింత పరిశీలన విధించాలని తెలిపింది. భారతీయ విద్యార్థుల్ని హై రిస్క్ కేటగిరిలో ఉంచింది. దీంతో భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల మంజూరులో చాలా ఇబ్బందులుంటాయి. ఈ మార్పులు జనవరి 8, 2026 నుండి అమలులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలో నాణ్యమైన విద్యను కోరుకునే నిజమైన విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తూనే ఉంటుందని, అయితే తప్పుడు పత్రాలతో వచ్చే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది.

అదనంగా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ సహా అనేక ఇతర దక్షిణాసియా దేశాలు కూడా AL3 లో ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఈ అత్యధిక ప్రమాదకర శ్రేణిలోనే ఉంది. గతంలో ఇండియా ఏఎల్2లో ఉండేది. ఏఎల్3 కేటగిరిలో ఉండటం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కఠినంగా ఉంటుంది. అదనపు తనిఖీలు నిర్వహిస్తారు. కొత్త రూల్స్ వల్ల విద్యార్థుల ఫైనాన్స్ స్టేటస్, ఇంగ్లీష్ స్పీకింగ్, తాత్కాలిక వసతి వంటి అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. ఆస్ట్రేలియాలో చదివే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం. అయినప్పటికీ, మన దేశాన్ని ఎల్3లో చేర్చింది. జనవరి 8 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Next Story