ఆస్ట్రేలియా బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది ప్రజలను చంపేశారు. ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి స్పందించారు. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్ మాట్లాడినట్లు తెలిపింది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని, కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని వెల్లడించింది. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని తేలింది.