ఖమేనీ మృతి.. పాక్‌లోని US కాన్సులేట్‌కు నిప్పుపెట్టిన నిర‌స‌న‌కారులు.. 9 మంది మృతి

అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తలు వెలువడిన వెంటనే పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది.

By -  Medi Samrat
Published on : 1 March 2026 3:31 PM IST

ఖమేనీ మృతి.. పాక్‌లోని US కాన్సులేట్‌కు నిప్పుపెట్టిన నిర‌స‌న‌కారులు.. 9 మంది మృతి

అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తలు వెలువడిన వెంటనే పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. US ఎంబసీ వెలుపల నిరసనలు ప్రారంభమయ్యాయి. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. కనీసం 9 మంది నిరసనకారులు మరణించినట్లు, 32 మంది గాయపడినట్లు నివేదించబడింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కర్రలతో కాన్సులేట్ చుట్టూ చేరి విధ్వంసం ప్రారంభించారు. దీంతో స్థానిక పోలీసులు గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించవలసి వచ్చింది. హెచ్చరికగా కాల్పులు జరిపారు.

సుల్తానాబాద్ నుండి మై కొలాచికి అనుసంధానించే రహదారులను అధికారులు కొద్దిసేపు మూసివేశారు.జిన్నా వంతెన నుండి ట్రాఫిక్ I.Iకి మళ్లించి చుండ్రిగర్ రోడ్డు నుంచి పంపారు. ప్రజా శాంతిని కాపాడటంకై ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జనసమూహం ప్రవేశ ద్వారం ధ్వంసం చేయడం, భవనంలోని భాగాలకు నిప్పు పెట్టడం కనిపిస్తుంది.

Next Story