విదేశాల్లో గన్‌కల్చర్ పెరుగుతోంది. దీంతో అనేక చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. థాయిలాండ్‌లోని ఓ ఫ్రీస్కూల్ వద్ద ఈ రోజు ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు ఫ్రీ స్కూల్ వద్ద కాల్పులకు తెగబడడంతో ఇప్పటి వరకు కనీసం 34 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు ఉన్నారు.
నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్ బు నాలాంపూ ప్రావిన్స్‌లోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో ఈ ఉదయం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి దుండగుడు ఓ పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడు. ఈ కాల్పుల ఘటనలో 34 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది గాయపడ్డారని.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో అత్యధికులు చిన్నారులు ఉండడంతో వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఈ ఘటనను పాల్పడింది మాజీ పోలీస్ అధికారి 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్‌గా గుర్తించారు. మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో ఏడాది కిందట అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది. ఈ విచారణకు అతడు హాజరుకావాల్సి ఉంది.
కాగా.. గతంలో థాయిలాండ్‌లోని నఖోమా రాట్చెస్మా నగరంలో 2020లో ఓ సైనికుడు కాల్పులు జరపగా.. 29 మందిని మరణించిన సంగతి తెలిసిందే.