మదరసాలో పేలుడు.. 19 మంది మృతి
At least 19 killed in blast at madrassa.ఓ మదరసాలో జరిగిన పేలుడులో 19 మంది మరణించగా, 24 మందికి పైగా గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్
అఫ్గానిస్తాన్ తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన తరువాత బాంబుల మోతతో ఆ దేశం దద్దరిల్లుతోంది. ఉగ్రవాద సంస్థలు అక్కడ పౌరులే లక్ష్యంగా డజన్ల కొద్ది బాంబు పేలుళ్లు, దాడులు చేశాయి. తాజాగా ఓ మదరసాలో జరిగిన పేలుడులో 19 మంది మరణించగా, 24 మందికి పైగా గాయపడ్డారు.
ఉత్తర నగరమైన ఐబాక్‌లోని మదర్సాలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, 24 మంది గాయపడ్డారని స్థానిక వైద్యుడు ఒకరు మీడియాకి తెలిపారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఐబాక్ నగరంలోని తమ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చిన వారిలో యువతే అధికంగా ఉన్నారని చెప్పారు.
ఇస్లామిక్ మత పాఠశాల అయిన అల్ జిహాద్ మదరసాలో పేలుడు జరిగిన ప్రావిన్షియల్ అధికారి ధృవీకరించారు. అయితే మృతుల సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేదు. 10 మంది విద్యార్థులు మరణించారన్నారు. "చాలా మంది" గాయపడ్డారని తాలిబన్లు తరచుగా మరణ గణాంకాలను సవరిస్తున్నారు.
అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ కూడా ఈ పేలుడు ఘటనను నిర్ధారించారు. మా డిటెక్టివ్, భద్రతా దళాలు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుని తగిన శిక్ష విధిస్తామని చెప్పారు. తామే ఈ దాడికి పాల్పడినట్లు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించలేదు.