సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. సిరియాలోని పలు నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకున్న హయాత్ తహ్రీర్ అల్ షమ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్క్‌స్ ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రెబెల్స్ తమ విజయాన్ని ప్రకటించారు. బషర్ అల్-అసద్ కు రష్యా ఆశ్రయం కల్పించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక ఐసిస్ స్థావరాలపై అమెరికా వరుస దాడులు మొదలు పెట్టింది. సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలచుకొని తిరిగి బలపడాలని ఐసిస్ చూస్తోందని, తాము అలా జరగనివ్వబోమని అమెరికా తెలిపింది. స్పష్టమైన ఆలోచనతోనే ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సిరియాలో అధ్యక్షుడు అస్సాద్ పాలన పతనమవ్వడం న్యాయమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు.