భారత్, పాక్ సహా చాలా యుద్ధాలను విరమింపజేసినందుకు తమ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా-పాక్, థాయిలాండ్ - కంబోడియా, ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడు. సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడు కాబట్టి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి..అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాల వల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని కరోలిన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు.