రంజాన్‌కు ముందు.. పాకిస్థాన్‌లో టీ సంక్షోభం
Ahead of Ramzan, tea crisis looms in Pakistan as prices surge. రంజాన్‌కు ముందు, ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో టీ సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్‌లో బ్లాక్
By అంజి Published on 12 Feb 2023 6:40 AM GMTరంజాన్‌కు ముందు, ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో టీ సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్‌లో బ్లాక్ టీ పౌడర్ గత 15 రోజుల్లో కిలోకు రూ. 1,100 నుండి రూ. 1,600కి పెరిగింది. ఎందుకంటే డిసెంబర్ 2022 చివరి నుండి జనవరి ఆరంభం వరకు దిగుమతి చేసుకున్న దాదాపు 250 కంటైనర్లు ఇప్పటికీ ఓడరేవులో నిలిచిపోయాయి అని స్థానిక మీడియా పేర్కొంది. ఒక ప్రముఖ బ్రాండ్ 170 గ్రాముల దనేదార్, ఇలాచి ప్యాక్‌ల ధరను రూ.290 నుండి రూ.320, రూ.350కి పెంచిందని ఒక రిటైలర్ తెలిపారు. 900, 420 గ్రాముల ప్యాక్‌లు ఇప్పుడు రూ.1,480, రూ.720గా ఉండగా.. ఇదివరకు రూ.1,350, రూ.550గా ఉన్నాయి. ఇతర ప్యాకర్లు దీనిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు.
టీపై పాకిస్థాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌పిసిసిఐ) కన్వీనర్ స్టాండింగ్ కమిటీ కన్వీనర్ జీషన్ మక్సూద్ మాట్లాడుతూ.. దిగుమతులు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయని, ఇది మార్చిలో భారీ కొరతకు దారితీయవచ్చన్నారు. 180 రోజుల వాయిదా ఒప్పందాలు లేదా 180 రోజుల క్రెడిట్ లెటర్స్ (LCs)పై పత్రాలను విడుదల చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (SBP) నుండి ఆదేశాలు ఉన్నాయని బ్యాంకులు చెబుతున్నాయని ఆయన అన్నారు.
180 రోజుల వాయిదా చెల్లింపుపై ఎవరైనా ఈ కంటైనర్‌లను విడుదల చేస్తే, ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో ఆరు నెలల తర్వాత డాలర్ రేటు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి దిగుమతి చేసుకున్న టీ ధరను ఎలా లెక్కగడతామని జీషన్ మక్సూద్ తెలిపారు. పాకిస్తాన్ టీ అసోసియేషన్ (PTA) ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా ఉన్న జీషన్, కొత్త కాంట్రాక్టుల కోసం ఎస్‌బీపీ నుండి ఎటువంటి ఆదేశాలు లేవని బ్యాంకులు క్రెడిట్ లెటర్స్‌ను తెరవడం లేదని అన్నారు.
నిలిచిపోయిన సరుకులను విడుదల చేయకపోతే రంజాన్‌లో టీ ధర కిలో రూ. 2,500కు చేరుకుంటుందని అంచనా. దీంతో సంక్షేమ సంఘాలు రేషన్ బస్తాల్లో టీ పౌడర్ పంపిణీ చేయలేక పోతున్నాయని, వాటి కొరత, అధిక ధరల వల్ల టీ పౌడర్‌ని పంపిణీ చేయలేకపోతున్నారని తెలిపారు. కెన్యాతో పాకిస్థాన్ ప్రిఫ్రెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ)పై సంతకం చేయాలని జీషన్ సూచించారు. "మేము 90 శాతం కెన్యా టీని మొంబాసాలో వారంవారీ వేలం నుండి దిగుమతి చేస్తాము, ఇక్కడ మొత్తం ఆఫ్రికన్ ఆరిజిన్ టీలు విక్రయించబడతాయి" అని చెప్పారు.
కెన్యా ఏడు భూపరివేష్టిత దేశాలను కలుపుతూ ఆఫ్రికాకు ప్రవేశ ద్వారం. పాకిస్తాన్ కెన్యా నుండి సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల విలువైన టీని దిగుమతి చేసుకుంటుంది.