అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా నాటో దేశాలతో ట్రంప్ సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. వైట్ హౌస్ వర్గాల ప్రకారం.. ట్రంప్ సమావేశానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని జెలెన్స్కీతో పాటు యూరోపియన్ దేశాలకు అందించారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో కూడా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. వాన్ డెర్ లేయన్ ప్రతినిధి కూడా ట్రంప్ ఫోన్ కాల్‌ను ధృవీకరించారు.
ట్రంప్ చేసిన ఈ ఫోన్ కాల్‌లో ప్రపంచంలోని పలువురు పెద్ద నాయకులు పాల్గొన్నారు. ఈ జాబితాలో నాటో సెక్రటరీ మార్క్ రుట్టే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ, ఫిన్లాండ్, పోలాండ్, ఇటలీ, బ్రిటన్ సీనియర్ నాయకుల పేర్లు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో నేతలందరితో ట్రంప్ ఏం మాట్లాడారు? అనే సమాచారం వెల్లడి కాలేదు. జర్నలిస్టులతో మాట్లాడేందుకు ట్రంప్ నిరాకరించారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ జెలెన్స్కీ.. NATO నాయకుల మధ్య సంభాషణను ధృవీకరించారు. ట్రంప్‌తో మాట్లాడిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వాషింగ్టన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాస్కాలో పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన సమావేశం నిస్సందేహంగా అసంపూర్తిగా మిగిలిపోయిందని ఊహాగానాలు వెలువడ్డాయి.. అయితే ట్రంప్ ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చర్చలు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అలస్కాలోని ఎంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ భేటీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమింపచేయడంలో ట్రంప్ విఫలమయ్యారని వార్తలు వెలువడ్డాయి.