Video : నటుడు అజిత్ కుమార్ కారుకు ప్రమాదం

దుబాయ్ గ్రాండ్ ప్రీ ప్రాక్టీస్ సెషన్‌లో నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.

By Medi Samrat  Published on  7 Jan 2025 8:25 PM IST
Video : నటుడు అజిత్ కుమార్ కారుకు ప్రమాదం

దుబాయ్ గ్రాండ్ ప్రీ ప్రాక్టీస్ సెషన్‌లో నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. కారు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, అజిత్ కు ఎలాంటి గాయాలు అవ్వకుండా వాహనం నుండి బయటకు వచ్చారు. అజిత్ రేసింగ్ బృందం ఈ క్రాష్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రాక్టీస్ సెషన్‌లో జరిగిన ప్రమాదమని తెలిపారు. ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదని వివరించారు. జనవరి 9న ప్రారంభం కానున్న దుబాయ్ గ్రాండ్ ప్రి కోసం అజిత్ కుమార్ బృందం సిద్ధమవుతోంది. గతేడాది సెప్టెంబర్ లో 'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో తన సొంత రేసింగ్ టీమ్‌ను ప్రారంభించాడు

అజిత్ కుమార్ కొన్ని దశాబ్దాల తర్వాత తన చిరకాల వాంఛలలో ఒకటైన రేసింగ్‌కి తిరిగి వచ్చారు. గతంలో ఫార్ములా BMW ఆసియా, బ్రిటిష్ ఫార్ములా 3, FIA F2 ఛాంపియన్‌షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో పాల్గొన్నారు. అజిత్ తన సొంత రేసింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, బహుళ అంతర్జాతీయ ఈవెంట్‌లలో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. 2025లో అతని బృందం యూరప్ లో వరుస పోటీలలో పాల్గొంటుంది.

Next Story