6 ఏళ్ల విద్యార్థి బుల్లెట్‌కు గాయపడిన టీచర్‌కి 10 మిలియన్ డాలర్లు.. ఏం జ‌రిగిందంటే.?

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఆరేళ్ల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని కాల్చి గాయపరిచాడు.

By -  Medi Samrat
Published on : 7 Nov 2025 10:07 AM IST

6 ఏళ్ల విద్యార్థి బుల్లెట్‌కు గాయపడిన టీచర్‌కి 10 మిలియన్ డాలర్లు.. ఏం జ‌రిగిందంటే.?

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఆరేళ్ల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని కాల్చి గాయపరిచాడు. ఆమె బోధించిన న్యూపోర్ట్ న్యూస్ ఎలిమెంటరీ స్కూల్‌లోని పాఠశాల సిబ్బంది స‌హా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ ఉపాధ్యాయురాలు అబిగైల్ జ్వార్నర్ బాలుడి వద్ద తుపాకీ ఉంద‌ని అప్ప‌టికే హెచ్చరించారు. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. విద్యార్థి ఉపాధ్యాయురాలిని కాల్చి గాయ‌ప‌ర‌చ‌డంతో కేసు నమోదైంది.

ఉపాధ్యాయురాలు అబిగైల్ జ్వార్నర్ తరఫు న్యాయవాదులు, 6 ఏళ్ల బాలుడు పాఠశాలకు తుపాకీని తీసుకువచ్చాడని, తోటి విద్యార్థుల నివేదికలు జ్వార్నర్‌కు తెలుసునని వాదించారు. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు, చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. గురువారం ఈ కేసులో జ్యూరీ ఉపాధ్యాయుడికి $ 10 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. విద్యార్ధి తుపాకీని కలిగి ఉండటం, తుపాకీని కొనుగోలు చేసేటప్పుడు తప్పుడు వివ‌రాలు ఇవ్వ‌డం వంటి ఫెడరల్ ఆరోపణలపై 2023లో కాల్పుల్లో పాల్గొన్న విద్యార్థి తల్లి డెజా టేలర్‌కు 21 నెలల జైలు శిక్ష విధించబడింది.

బాలుడు తన బ్యాగ్‌లో ఇంటి నుంచి 9 ఎంఎం తుపాకీతో పాఠశాలకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. బాలుడు తన తరగతి గదిలో స‌డెన్‌గా తుపాకీని తీసి మొదటి తరగతి తరగతి గదిలో రీడింగ్ డెస్క్ వద్ద కూర్చున్న ఉపాధ్యాయురాలు అబిగైల్ జ్వార్నర్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె చేతికి, ఛాతీకి తగిలింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె చేతికి ఐదు సర్జరీలు జరిగాయి. బుల్లెట్ ఇప్పటికీ ఆమె ఛాతీలో ఉంది.

న్యూపోర్ట్ న్యూస్ పోలీసులు ఆమె ఎడమ చేయి, ఛాతీకి తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ, సుమారు 20 మంది విద్యార్థులను సురక్షితంగా నడిపించినందుకు ఆమెను ప్రశంసించారు.

Next Story