కల నిజమనుకుని.. కత్తితో అవి కోసేసుకున్నాడు.. తీరా లేచి చూసేసరికి

A Man chops off his own genitals while dreaming of goat slaughter. నిద్రపోతున్నప్పుడు చాలా మందికి కలలు వస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి తనకు వచ్చిన కల నిజమనుకుని తన జననాంగాలను

By అంజి
Published on : 24 Aug 2022 6:40 AM

కల నిజమనుకుని.. కత్తితో అవి కోసేసుకున్నాడు.. తీరా లేచి చూసేసరికి

నిద్రపోతున్నప్పుడు చాలా మందికి కలలు వస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి తనకు వచ్చిన కల నిజమనుకుని తన జననాంగాలను కత్తితో కోసుకున్నాడు. మేకను వధిస్తున్నట్లు కల కన్న అతడు.. తన జననాంగలను కత్తితో కోసుకున్నాడు. నొప్పితో నిద్రి లేచి చూసేసరికి.. జరిగిన ఘటన అర్ధమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఘనా దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అసిన్ ఫోసు ప‌ట్ట‌ణానికి చెందిన రైతు కోఫీ అట్టా (42) భార్య ఊరికి వెళ్లింది. కొన్ని రోజుల నుంచి అత‌ను ఒక్క‌డే ఇంట్లో ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కుర్చీలో కూర్చొని నిద్ర పోతున్నాడు. మధ్యాహ్నం భోజనం కోసం అత‌డి భార్యకు స‌హాయం చేసేందుకుగానూ మేక‌ను కోస్తున్న‌ట్లు క‌ల క‌న్నాడు. అయితే క‌త్తి తీసుకొని నిజంగానే త‌న పురుషాంగంతోపాటు జ‌న‌నేంద్రియాల‌ను కోసేసుకున్నాడు. దీంతో విప‌రీత‌మైన నొప్పిరావ‌డం మొదలైంది. వెంటనే నిద్ర నుంచి తేరుకుని.. జరిగిన విష‌యం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. నొప్పి కారణంగా గ‌ట్టిగా అరవడంతో.. పొరుగువారు గ‌మనించి అత‌డి భార్య‌కు ఇన్ఫర్మేషన్‌ అందించారు.

ఆ తర్వాత రైతు కోఫీ అట్టా భార్య అడ్వోవా కోనాడు ఇంటికి చేరుకుంది. భ‌ర్త జ‌న‌నాంగాల‌నుంచి ర‌క్తం కారుతుండ‌గా డైప‌ర్ వేసి ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాధితుడిని మొదట అసిన్ ఫోసులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాథలిక్ ఆస్పత్రిలో చేర్చారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం అత‌డిని కోంఫో అనోకీ టీచింగ్ హాస్పిట‌ల్‌కు త‌రలించారు. ఆరు వారాల శస్త్రచికిత్స తర్వాత తిరిగి అత‌డి పురుషాంగాన్ని అతికించొచ్చ‌ని వైద్యులు తెలిపారు. అంగం ప‌నితీరు య‌ధావిధిగా ఉంటుంద‌ని వైద్యులు చెప్పారు.

Next Story