ఇండోనేషియాలో గురువారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో తెల్లవారుజామున 00:46 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదు అయినట్లు వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చ అవకాశం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఈ భూప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెబుతున్నారు.