ఇండోనేషియా రాజధాని జకార్తాలోని స్కూల్ కాంప్లెక్స్ లోపల నిర్మించిన మసీదులో ప్రార్థనల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఉత్తర జకార్తాలోని కెలాపా గాడింగ్‌లో జరిగిన పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు జకార్తా పోలీసు చీఫ్ అసెప్ ఈడీ సుహేరి విలేకరుల సమావేశంలో తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 54. గాయపడిన వారికి చిన్నపాటి నుంచి తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది శరీరాలపై కాలిన గాయాలున్నాయి. రాయిటర్స్ ప్రకారం, మసీదుకు పెద్దగా నష్టం జరగలేదు.