గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందించే ప్రయత్నంలో ప్రతి వారం కొత్త స్టార్‌లింక్‌ల ప్రయోగాన్ని వేగవంతం చేస్తున్నాడు ఎలాన్ మస్క్. లో ఎర్త్ ఆర్బిట్‌లో అతిపెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌లను మోహరించడానికి ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ నిరంతరం పని చేస్తూనే ఉంది.
ఈ శాటిలైట్స్ ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. ఐదు సంవత్సరాలలో స్టార్ లింక్ కంపెనీ 500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కోల్పోయిందని ఒక కొత్త విశ్లేషణ వెల్లడించింది. ఉపగ్రహాలు సూర్యుని ఉగ్రరూపాన్ని తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నాయి. సౌర చక్రంలో శిఖరాగ్రానికి సంబంధించిన సంవత్సరాలైన 2020 నుండి 2024 వరకు, ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ 523 ఉపగ్రహాలను కోల్పోయింది. ప్రస్తుతం సూర్యుడు గరిష్ట స్థాయిలో ఉన్నాడు, ఈ కాలంలో సూర్యుడు అత్యంత చురుకుగా ఉంటాడు. సూర్యరశ్మి గణనలు అత్యధికంగా ఉంటాయి. శక్తివంతమైన సౌర జ్వాలలు, CMEలు ఎక్కువగా సంభవిస్తాయి.