ప్ర‌యాణికుల‌ వ్యాన్‌పై ఉగ్ర‌మూక‌ల‌ బుల్లెట్ల వర్షం.. 38 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి వార్త వచ్చింది. వాయువ్య పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతంలో గురువారం ప్రయాణీకుల వ్యాన్‌పై తుపాకీ దాడిలో 38 మంది మరణించినట్లు చెబుతున్నారు.

By Medi Samrat  Published on  21 Nov 2024 5:32 PM IST
ప్ర‌యాణికుల‌ వ్యాన్‌పై ఉగ్ర‌మూక‌ల‌ బుల్లెట్ల వర్షం.. 38 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి వార్త వచ్చింది. వాయువ్య పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతంలో గురువారం ప్రయాణీకుల వ్యాన్‌పై తుపాకీ దాడిలో 38 మంది మరణించినట్లు చెబుతున్నారు. అలాగే పలువురు గాయపడినట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుర్రంలోని పరాచినార్ నుండి కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిని ఖైబర్ పఖ్తుంఖ్వా చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌదరి ధృవీకరించారు.

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న గిరిజన ప్రాంతంలో భూ వివాదంపై సాయుధ షియా, సున్నీ ముస్లింల మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత పరిస్థితి ఉంది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

పరాచినార్‌లోని స్థానిక నివాసి జియారత్ హుస్సేన్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. రెండు ప్రయాణీకుల వాహనాల కాన్వాయ్‌లు ఉన్నాయని.. ఒకటి పెషావర్ నుండి పరాచినార్‌కు..మరొకటి పారాచినార్ నుండి పెషావర్‌కు ప్రయాణీకులను తీసుకువెళుతుండగా.. సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారని వెల్ల‌డించారు.

Next Story