ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కెనడాలోని మానిటోబాలోని కార్బెర్రీ పట్టణం సమీపంలో సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో

By అంజి  Published on  16 Jun 2023 1:30 AM GMT
Canada, Manitobe, Accident, international news

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కెనడాలోని మానిటోబాలోని కార్బెర్రీ పట్టణం సమీపంలో సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో నిండిన బస్సు మధ్య ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. మానిటోబా అధికారి రాబ్‌ హిల్‌ మాట్లాడుతూ.. హైవే వన్‌, హైవే ఫైవ్‌ కూడలిలో 25 మందితో ప్రయాణిస్తున్న మినీ బస్సు.. సెమీ ట్రక్కుని ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఎక్కువ మంది సీనియర్‌ సిటిజన్స్ ఉన్నారు. బస్సు పశ్చిమ మానిటోబా నగరం డౌఫిన్ నుండి వెళ్తుండగా.. కార్బెర్రీకి ఉత్తరాన ట్రాన్స్-కెనడా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాబ్‌ హిల్‌ అన్నారు.

ప్రమాద స్థలానికి మౌంటీలను పంపినట్లు ప్రధాన నేర సేవలకు బాధ్యత వహించే అధికారి సుప్ట్ రాబ్ లాసన్ తెలిపారు. సీనియర్లను తీసుకెళ్తున్న బస్సు హైవే 5లో దక్షిణం వైపు వెళుతోందని, ట్రాన్స్-కెనడా హైవే యొక్క తూర్పు వైపున ఉన్న లేన్‌లను దాటుతున్నప్పుడు సెమీ ఢీకొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని లాసన్ చెప్పారు. రోడ్డు ప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం అత్యవసర వాహనాలు, రెండు హెలికాప్టర్లు వచ్చాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపిందని కెనడా ప్రైమ్‌ మినిస్టర్ జస్టిన్ ట్రూడో తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. ‘‘కార్బెర్రీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం వార్త విని నా గుండె పగిలింది. ఇందులో మరణించిన వారందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని మానిటోబా ప్రీమియర్ హీథర్ స్టెఫాన్సన్ ట్వీట్ చేశారు.

Next Story