నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు నేపాల్‌లో గురువారం ప్రయాణీకుల బస్సు కొండ రహదారిపై నుండి 300 మీటర్ల దూరం గల లోయలో పడిపోయింది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో 20 మంది ప్రయాణికులతో మాడి, శంఖువాసవ నుండి ఝాపాలోని దమాక్‌కు వెళుతున్న బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కొండ రహదారిపై 300 మీటర్ల దూరంలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది.
"ఈ ప్రమాదంలో కనీసం 14 మంది చనిపోయారు. మరణించిన వారి గుర్తింపులు ఇంకా నిర్ధారించబడలేదు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఐదుగురిని సజీవంగా రక్షించారు. అయినప్పటికీ వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించబడ్డారు. పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు" అని పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని పర్వత ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణం. గత నెలలో పశ్చిమ నేపాల్‌లో నూతన వధూవరులను, కొంతమంది వివాహ పరిచారకులను తీసుకువెళుతున్న ప్రయాణీకుల వాహనం పశ్చిమ నేపాల్‌లోని కొండ రహదారిపై జారిపడి ఎనిమిది మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.