ఉగ్ర బీభ‌త్సం.. వంద మందిని పొట్టనబెట్టుకున్నారు..

100 Dead In Terror Attacks On Two Western Niger Villages. ఉగ్రవాదులు బీభ‌త్సానికి ఒడిగ‌ట్టారు. వంద మందిని పొట్టనబెట్టుకున్నారు..

By Medi Samrat
Published on : 4 Jan 2021 10:51 AM IST

Terror attacks
ఉగ్రవాదులు బీభ‌త్సానికి ఒడిగ‌ట్టారు. పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లోని.. మాలి సరిహద్దుల్లో ఏకంగా రెండు గ్రామాలపై ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డ ఉగ్ర‌వాదులు ఏకంగా 100 మందిని పొట్టనబెట్టుకున్నారు.


అంతర్గత వ్యవహారాల మంత్రి అల్కాచే అల్హాడా మాట్లాడులూ.. ఆదివారం సాయంత్రం మాలి సరిహద్దు సమీపంలోని తోచబంగౌ, జారౌమ్‌దారే గ్రామాలపై ఉగ్రవాదులు దాడిచేశారని తెలిపారు. మృతుల్లో 70 మంది తోచబంగౌ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. మరో 75 మంది గాయపడ్డారని.. వారిని రాజధాని నియామేలోని దవాఖానకు తరలించామన్నారు.

ఇదిలావుంటే.. ఈ ఘాతుకానికి పాల్పడింది బోకోహారమ్‌ ఉగ్రవాద సంస్థ అని అధికారులు వెల్లడించారు. గత శనివారం బోకోహారమ్‌ సంస్థకు చెందిన ఇద్దరిని గ్రామస్థులు చంపేశారు. దీంతో ప్రతికార చ‌ర్య‌గా ఉగ్రవాదులు ఆదివారం సాయంత్రం.. ఆ రెండు గ్రామాలపై దాడిచేసి 100 మందిని కాల్చి చంపారని వెల్ల‌డించారు. కాగా ఉగ్ర‌సంస్థ‌ అల్‌ఖైదాతో బోకోహారమ్‌ కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Next Story