ప్రాణయామం చేయండి.. ఆరోగ్యంగా ఉండండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 8:31 AM IST
ప్రాణయామం చేయండి.. ఆరోగ్యంగా ఉండండి

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు.. ప్రతి ఒక్కరు.. ప్రాణాయామం చేయాలని సూచించారు. దీనిని చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. రోగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అనేక రకాల ప్రాణాయామాలు, యోగాసనాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు సైతం యోగా ప్రాముఖ్యతను గుర్తించాయని తెలిపారు. రోగ నిరోధక శక్తి కరెక్టుగా ఉంటే..కరోనాను దూరం చేయవచ్చని, ఇందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయన్నారు. యోగాను ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయవద్దని, మన జీవితంలో యోగాని భాగం చేసుకోవాలన్నారు.

Next Story