ఇన్ స్టా లో కొత్త ఫీచర్..ప్రత్యేకంగా వారికోసమే..
By రాణి Published on 25 March 2020 3:28 PM ISTఇన్ స్టా గ్రామ్ లో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల కోసమే రూపొందించడం విశేషం. ఇండియాతో పాటు చాలా దేశాలు లాక్ డౌన్ అయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలం అని అన్ని దేశాలు గ్రహించాయి. లాక్ డౌన్ తో సామాజిక దూరం పెరిగింది. మరోవైపు ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను చూసేందుకు ఎవరినీ అనుమతించరు. దీంతో వారు ఆస్పత్రిలో ఉన్నా జైలులో ఉన్నామన్న అనుభవమే వస్తోంది.
Also Read : పోతావురరేయ్.. పోతావ్ అంటున్న సుమక్క
అలాంటి వారికోసమే ఇన్ స్టా కొత్త ఫీచర్ ను ఆవిష్కరించింది. అదే ‘Co-Watching’. ఇలాంటి సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ కొత్త ఫీచర్. ఇంట్లోనే ఉండి మీ స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని అప్పర్ లెఫ్ట్ కార్నర్‌పై ఉన్న Video Icon క్లిక్ చేయొచ్చు లేదా కొత్త కాన్వర్జేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
Also Read : జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్
అంతేకాకుండా..ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టా స్టోరీ ఫిల్టర్లను కూడా యాక్సస్ చేసుకునే వీలుంది. ఇన్ స్టాగ్రామ్‌లో ప్రధానంగా యూజర్లు కింది స్ర్కోల్ చేస్తూ తమ స్నేహితుల పోస్టులు, స్టోరీలు లేదా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లను ఒకేసారి వీక్షించవచ్చు. సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఇన్ స్టా యూజర్లకు కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ సామాజికంగా దూరమయ్యామన్న భావనను తగ్గిస్తుంది.