చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ బారీన పడి ఇప్పటికే 260 మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో వైరస్‌ భాధితులు ఉన్నారు. కాగా ఈ వైరస్‌కు ఇంకా మందును కనిపెట్టలేదు. రోజు రోజుకు చనిపోయ వారి సంఖ్య పెరుగుతుండడంతో అక్కడున్న వారు బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. చైనాలో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వారు తమ సొంత దేశాలకు వేళ్లేందుకు క్యూ కట్టారు. కాగా ఇవాళ వూహాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

Indians Evacuated From China

వుహాన్‌ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న, ఇవాళ దాదాపు 647 మంది ప్రయాణికులను చైనా నుంచి భారత్‌కు తరలించారు. ఇవాళ ఉదయం 347 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం హర్యానాలోని మానేసర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచారు. 14 రోజుల వైద్యల పర్యవేక్షణ అనంతరం వారిని.. వారి సొంత ఇళ్లకు పంపించనున్నారు.

Indians Evacuated From China

భారతీయ మూలానికి చెందిన విద్యార్థులు చైనాలో కరోనా వైరస్ దాడి వల్ల పలు ఇబ్బందులు పడుతున్నారు. గదులకే పరిమితమై ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తాగునీరు దొరకక వాష్ రూమ్ లలోని నీటిని తాగాల్సి వస్తోంది. చైనాలో దాదాపు 750 మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. షాంఘై వంటి నగరాల్లో భారతీయులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. వీరి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.