యూఏఈ చేరుకున్న భార‌త మహిళా క్రికెటర్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 6:53 AM GMT
యూఏఈ చేరుకున్న భార‌త మహిళా క్రికెటర్లు

మహిళల టీ20 ఛాలెంజర్‌ (మినీ ఐపీఎల్‌) కోసం భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు యూఏఈ చేరుకున్నారు. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ లాంటి అగ్రశ్రేణి క్రికెటర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్‌ లాంటి యువ సంచలనాలు మొత్తం 30 మంది గురువారం యూఏఈలో అడుగుపెట్టారు. పీపీఈ కిట్లతో ఉన్న ఈ మ‌హిళా క్రికెటర్ల ఫోటోలను ఐపీఎల్‌ ట్విట్టర్‌లో ట్వీట్

చేసింది.

షార్జా వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్‌నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్‌ పడుతున్నారు.

ఇప్ప‌టికే తొమ్మిది రోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు.. యూఏఈలో బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత ప్రాక్టీస్‌ చేయనున్నారు. నాలుగు మ్యాచ్‌లకూ షార్జానే వేదిక కానుంది. ఒక్కో జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ షార్జాలోనే నిర్వహించనున్నారు.

Next Story