పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు

By సుభాష్  Published on  14 Oct 2020 8:59 AM GMT
పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ. దసరా, దీపావళి పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది రైల్వే. జోన్లవారీగా 392 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది.

ఈ కొత్త రైళ్లు అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నడవనున్నాయి. అయితే వీటి టికెట్ ధరలు కూడా ఎక్కువే ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో కొన్ని రోజూ నడుస్తుండగా, మరికొన్ని రైళ్లు వారంలో నాలుగు రోజులు, ఇంకొన్ని రైళ్లు వీకెండ్‌లో నడవనున్నాయి. ఇక ఈ రైళ్లన్నీ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ కొత్త రైళ్లు నవంబర్‌ 30 వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల టికెట్‌ బుకింగ్‌ విషయంలో పాత రిజర్వేషన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎక్కువగా ఏపీ ఎక్స్‌ ప్రెస్‌, దురోంటో, రాజధాని, శతాబ్ది కేటగిరికి చెందినవి ఉన్నాయి.

Next Story