ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం..
By అంజి Published on 19 March 2020 12:57 PM ISTభారతదేశంలో కరోనా వైరస్ సైలెంట్‌గా విజృంభిస్తోంది. ఒకటి రెండు కేసులతో మొదలైన కేసులు.. 172కు చేరుకున్నాయి. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టింది. దేశ ప్రజలందరికి ప్రత్యేక సలహాలు, సూచనలు జారి చేసింది. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే ప్రధాని మోదీ సూచించారు.
ఇదిలా ఉంటే కరోనా ప్రభావంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకుతుందేమోన్న భయంతో ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడడం లేదు. దీంతో పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులను తగ్గించాయి. రైలు ప్రయాణాలకు కూడా ప్రజలు మొగ్గు చూపడం లేదు. దీంతో భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: భారత్ లో 172 కరోనా కేసులు..
ప్రధాన రైళ్లకు జనాదరణ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 300 రైళ్లు రద్దు చేస్తున్నామని ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే రైళ్ల రద్దు అమలు మార్చి 20 నుంచి మార్చి 31 వరకు ఉంటుందని తెలిపింది. ఆ తదుపరి కరోనా వైరస్ వ్యాప్తిపై పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటమాని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 98 రైళ్లను అధికారులు రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో 20, వెస్ట్, నార్తరన్ సెంట్రల్ రైల్వేలో 11, సదరన్ రైల్వేలో 32, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మరో 5 రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల రద్దు గురించి.. రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న వారికి ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో ఫోన్‌కు సమాచారం అందిస్తామని ఇండియన్ రైల్వే తెలిపింది.
Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్లాట్‌ఫాం ధరను భారీగా పెంచేసిన రైల్వేశాఖ
ఇక రైల్వే స్టేషన్‌లలో జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు కేటరింగ్ పనులు చేయకూడదని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, చండీఘడ్ రాష్ర్టాల్లో నమోదైన కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా 172 కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 32 మంది ఇతర దేశస్థులున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వే శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ.50 పెంచింది. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.