భారత్ లో 172 కరోనా కేసులు..

By రాణి  Published on  19 March 2020 6:07 AM GMT
భారత్ లో 172 కరోనా కేసులు..

భూ మండలంపై ఉన్నవారందరినీ భయభ్రాంతులకు గురి చేసి..ఆర్థిక మాంద్యంపై దెబ్బకొట్టి..85 కోట్ల మంది విద్యార్థులు విద్యా సంస్థలకు దూరమవ్వడానికి కారణమైంది కరోనా వైరస్. తాజాగా కరీంనగర్ ఏకంగా 12 కరోనా కేసులు నిర్థారణవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరంగా 100 మంది సిబ్బందిని రంగంలోకి దింపి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వైద్య పరీక్షలు చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, చండీఘడ్ రాష్ర్టాల్లో నమోదైన కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా 172 కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 32 మంది ఇతర దేశస్థులున్నారు.

Also Read : గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..

కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువైన చైనాలో గురువారం ఒక్కకేసుకూడా నమోదు అవ్వలేదు. కానీ ఇటలీలో మాత్రం ఈ వైరస్ సోకిన వారిలో ఏకంగా 475 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 2978కి పెరిగింది. ఇంకా 35,713 మంది వైరస్ బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అక్కడ మృతుల సంఖ్య ఇంత ఎక్కువగా లేదంటోంది డబ్ల్యూహెచ్ఓ. కరోనా కారణంగా ఒక్కరోజులోనే ఇంత ఎక్కువ మరణాలు సంభవించిన తొలి దేశం ఇటలీనే. దీనిని బట్టి ఆ దేశంలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. కాగా..ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వైరస్ బాధితుల సంఖ్య 2 లక్షలు దాటేయగా..కరోనా మృతుల సంఖ్య 8 వేలకు పైగా నమోదయ్యాయి.

Also Read : సెలబ్రిటీస్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

Next Story