సెలబ్రిటీస్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

By రాణి  Published on  18 March 2020 1:11 PM GMT
సెలబ్రిటీస్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

''సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్'' ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. అందులో భాగంగానే బాలీవుడ్ కథానాయికలు దీపా పదుకొనె, ప్రియాంక చోప్రాలతో పాటే పలువురు సెలబ్రిటీలను దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరింది. దీంతో దీపికా, ప్రియాంకా లతో పాటు అనుష్క శర్మ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని చేతులను సరైన పద్ధతిలో ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తూ తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెలబ్రిటీలు చేసిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా బాలీవుడ్ భామలు కదా..ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. అదే..ఏ ఆరోగ్య సంస్థో..డాక్టర్లో చెప్తే వినరు కదా ప్రజలు.

దీపికా పదుకొనె చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించి..క్రికెటర్ కోహ్లీ, రొనాల్డొ, ఫెడరెర్ లను ఈ ఛాలెంజ్ చేసి చూపించాల్సిందిగా నామినేట్ చేసింది.టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన స్నేహితులతో కలిసి మాస్క్ లు వేసుకుని, శానిటైజర్లను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ..అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈరోజు షూటింగ్ ను క్యాన్సిల్ చేయలేకపోయాం కానీ..చిత్ర యూనిట్ మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ను స్వీకరించి..చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో వీడియో చేసి చూపించారు. అలాగే కోవిడ్ 19 రోజురోజుకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో కనీస జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

Next Story