భారత నౌకాదళంలో తొలిసారిగా..

By సుభాష్  Published on  21 Sept 2020 3:36 PM IST
భారత నౌకాదళంలో తొలిసారిగా..

భారత నౌకాదళంలో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెప్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగు పెట్టనున్నారు. భారత నౌకాదళంలో పలు ర్యాంకుల్లో ఎంతో మంది మహిళా అధికారులున్నా.. యుద్దనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పని చేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో పలు రకాల ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూమ్‌ల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటి వరకు యుద్ధ నౌకాల్లో మహిళా అధికారులను వినియోగించలేదు.

ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళంలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్‌-60 ఆర్‌ హెలికాప్టర్‌లో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఈ హెలికాప్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి.2018లో అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాక్‌హీడ్‌- మార్టిన్‌ నిర్మించిన ఈ హెలికాప్లర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు.

కాగా, రఫేల్‌ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌లను ఐఏఎఫ్‌ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమానమైన ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది.

Next Story