రిటైర్డ్‌ నేవి అధికారి దారుణ హత్య

By సుభాష్  Published on  21 Sep 2020 8:10 AM GMT
రిటైర్డ్‌ నేవి అధికారి దారుణ హత్య

న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్‌ నేవి అధికారిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన బాలరాజ్‌ దేశ్‌వాల్‌ అనే వ్యక్తి గతంలో నేవిలో పని చేసి రిటైర్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ప్రాపర్టీ బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఓ విషయంలో ప్రదీప్‌ ఖోఖర్‌ అనే వ్యక్తితో ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుని పెనుగులాటకు దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన ప్రదీప్‌ తుపాకీతో బాల్‌రాజ్‌దేశ్‌వాల్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆస్తి వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Next Story
Share it