ముంబైలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2020 3:08 AM GMT
ముంబైలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన జరిగింది. థానేలోని భివాండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. భవనం కూలిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు శిథిలాల నుంచి ఇప్పటి వరకు 25 మందిని రక్షించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

మరో 25 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 30 ఏళ్ల కిందట నిర్మాణం జరిగిన ఈ భవనం ఎల్ ఆకారంలో ఉండేది. ‘జిలానీ బిల్డింగ్’ పేరిట ఉన్న ఈ భవనానికి ఇప్పటికే రెండుసార్లు మహానగర్ పాలిక నోటీసులు ఇచ్చింది.

Next Story
Share it